Varun Sandesh Viraaji: ఇటీవల విడుదలైన ‘నింద’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు హీరో వరుణ్ సందేశ్. తాజాగా తన కొత్త సినిమా ‘విరాజి’తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మూవీకి ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. హర్షకు ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 2వ తేదీన థియేటర్లలోకి రానుంది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. నిర్మాత మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. విరాజి మంచి టైటిల్ అని, వరుణ సందేశ్‌ను ఇప్పటి దాకా చూడని విధంగా చూస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నో మూవీస్ చేసిన వరుణ్ హీరోగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. సూనిమా షూటింగ్ పూర్తయ్యిందని, నెల రోజుల గ్యాప్‌లో ప్రమోషన్ వర్క్ బాగా నిర్వహించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. తాము కొత్తగా ఇండస్ర్టీకి వచ్చామని, ప్రతి ఒక్కరూ సపోర్ట్ అందించి పరిశ్రమలో నిలదొక్కునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నటి ప్రమోదిని మాట్లాడుతూ విరాజి పేరుకు తగ్గట్లుగానే మూవీ చాలా బాగా వచ్చిందని తెలిపారు. మూవీలో తానొక కీలకమైన పాత్ర పోషించానని చెప్పారు. మూవీకి సంబంధించి బాగా ప్రమోషన్ చేసి గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకుల అభిరుచి మేరకు విరాజి ఉంటుందని తెలిపారు.
నటుడు రఘు కారు మంచి ప్రసంగిస్తూ మూవీకి డైరెక్టర్ విరాజి అనే మంచి టైటిల్ పెట్టారని కొనియాడారు. పట్టుబట్టి మరీ ఈ మూవీలో తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు. ఈ మూవీలో నటించడంతో కొత్త పరిచయాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. వరుణ సందేశ్‌తో సినిమా తీయడం హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెప్పారు. విరాజి బాగుంటుందని, ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నందని తెలిపారు.
నటుడు ఫణి మాట్లాడుతూ తాను యాంగర్ టేల్స్ అనే మూవీ చేశానని తెలిపారు. విరాజి తనకు రెండో సినిమా అని వెల్లడించారు. సినిమాలో తనకు అవకాశం కల్పించి దర్శకుడు హర్ష, నిర్మాత మహేంద్రలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇంటర్లో ఉన్నప్పుడు వరుణ హ్యాపీడేస్ సినిమా చూశానని, ఆ సినిమా ఇచ్చిన ఇన్స్పిరేషన్తో డిగ్రీ కంప్లీట్ చేశానని గుర్తుచేసుకున్నారు. విరాజి అందరికీ నచ్చే సినిమా అని వెల్లడించారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎబినెజర్ పాల్ (ఎబీ) మాట్లాడుతూ విరాజి కోసం ప్రొడ్యూసర్ మహేంద్ర, డైరెక్టర్ హర్ష తనను కలిశారని, ఈ మూవీకి మ్యూజిక్ అందించడం గొప్పగా ఫీలవుతున్నానని, తనకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారని వెల్లడించారు. బీజీఎం కోసం 45 రోజులు కష్టపడ్డామని తెలిపారు. ఆగ్టు 2న విడుదలయ్యే సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.
దర్శకుడు ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ విరాజి దర్శకుడిగా తన మొదటి సినిమా అని చెప్పారు. ఇది తమ సినిమాకు సంబంధించి మొదటి ప్రమోషన్ ఈవెంట్ అని తెలిపారు. విరాజి సినిమా కోసం ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలని, ఒక మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెర, ఆయన కథ విని ప్రొడ్యూసర్ మహేంద్ర దగ్గరకు తీసుకెళ్లారని తెలిపారు. మహేంద్ర ఒక ప్రొడ్యూసర్‌గానే కాకుండా ఒక టెక్నీషియన్‌గా మూవీకి వర్క్ చేశారని తెలిపారు. ఆయన ఎంతో సపోర్ట్ చేశారని తెలిపారు. ఇంకొకరు వరుణ్ సందేశ్ అని తెలిపారు. ఆయన ఎంతో చొరవ తీసుకొని విరాజి మూవీ చేశారని వెల్లడించారు.
హీరో వరుణ్ మాట్లాడుతూ విరాజి కథ చెప్పేందుకు హర్ష తనకు దగ్గరకు వచ్చాడని తెలిపారు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తరువాత కథ ఎలా ఉంటుదేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశానని, సెకండాఫ్‌కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయని తెలిపారు. కథ చాలా బాగుందని హర్షకు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. డైరెక్టర్ హర్షకు ఇది మొదటి సినిమానే అయినా చాలా బాగా వర్క్ చేశారని ప్రశంసించారు. ఇటీవల రిలీజ్ అయిన తన సినిమా ‘నింద’కు మంచి ఒపెనింగ్స్ వచ్చాయని తెలిపారు. నింద సక్సెస్ తమకు బూస్ట్ ఇచ్చినట్లైందని చెప్పారు. నింద డైరెక్టర్ రాజేశ్‌కు రెండు పెద్ద ప్రొడెక్షన్స్ నుంచి ఆఫర్ వచ్చిందని తెలిపారు. హర్షకు సైతం అలాంటి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పారు. సరిగ్గా నెల రోజుల తరువాత విరాజి ప్రేక్షకుల ముందుకు రాబోతోందని వెల్లడించారు. ప్రమోషన్ వర్క్ కొనసాగుతోందని, మూవీ అందరికీ నచ్చుతుందని తెలిపారు. తన 17 ఏళ్ల కెరీర్లో చేయని డిఫరెంట్ సినిమా విరాజి అని చెప్పారు. క్రేజీయెస్ట్ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామన్నారు.
సినిమా పేరు: విరాజి
నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరాం, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: ఆద్యంత్ హర్ష
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
బ్యానర్: ఎమ్ 3 మీడియా, మహా మూవీస్
డీవోపీ : జీవీ అజయ్ కుమార్
సంగీతం: ఎబినేజర్ పాల్ (ఎబ్బి)
ఎడిటర్: రామ్ తూము
కాస్ట్యూమర్ డిజైనర్: రోజా భాస్కర్
మేకప్ చీఫ్: భాను ప్రియ అడ్డగిరి
ప్రాజెక్ట్ హెడ్: సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: మల్లికార్జున్ కిన్నెర
ప్రొడక్షన్ మేనేజర్: శ్రావణ్ కుమార్ వందనపు
పోస్ట్ ప్రొడక్షన్: సారథి స్టూడియోస్
వీఎఫ్ఎక్స్ : అఖిల్
పోస్టర్ డిజైన్స్: జి.దినేశ్, గణేశ్ రత్నం
స్టిల్స్: మోహన్
అవుట్ డోర్ పబ్లిసిటీ: రత్నకుమార్ శీలం
డిజిటల్ పీఆర్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్స్
ఆడియో ఆన్: శబరి మ్యూజిక్