-

Venkateshwara khanapoor వారం రోజుల పాటు ఆధ్యత్మిక కార్యక్రమాలు
- వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చి మొక్కలు చెల్లించుకున్న భక్తులు
Sri Lakshmi Venkateshwara Swamy Brahmotsavam celebrations in Surjapur, Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి వార్షిక బ్రాహ్మోత్సవాలు వారం రోజుల పాటు ఘనంగా కొనసాగాయి. మంగళవారం జాతర మహోత్సవం, రథోత్సవం కన్నుల పండువగా సాగాయి. వేద పండితులు చక్రపాణి నర్సింహామూర్తి, అర్చకులు ఆచార్య కోటపెల్లి అనీష్, నితీష్ వేద మంత్రాల మధ్య నిత్యర్చన విధి, విష్ణు యాగం, నవగ్రహ యాగం, యజ్ఞం, నిత్యహావనం, బలిహరణ, మంత్ర పుష్పం వేద మంత్రాలతో మారుమోగాయి. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భజన బృందం భక్తి పాటలు ఆలపించారు. జాతర సందర్బంగా వివిధ దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా ప్రజలే కాకుండా హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాదు, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల, జిల్లాల నుండి భక్తులు తరలి వచ్చి స్వామి వారికి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు రాము నాయక్, వెంకగౌడ్, జంగిలి శంకర్, బక్కశెట్టి అశోక్, గాజుల గంగన్న, బిక్కి కృష్ణ, స్థానికులు సేవలo దించారు.

