HIV awareness: నిర్మల్, జనవరి 4 (మన బలగం): జిల్లాలో కొత్త హెచ్ఆర్జీలను గుర్తించి వారికి హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలని జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ నాగరాజు తెలిపారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ ఆదేశానుసారం మ్యాపింగ్ పాపులేషన్ సైట్ ఎస్టిమేషన్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో హెచ్ఆర్జీలు, వైఆర్‌జీకేర్, షూర్ ఎన్జీవో లింక్ వర్కర్స్, సిబ్బందికి నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కొత్తగా ఉన్న హెచ్ఆర్జీలను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారుచేసి వారికి పూర్తిగా హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన కలిగించే విధంగా కృషి చేయాలని తెలిపారు. అలాగే కొత్త హాట్‌స్పాట్లు, కొత్త ఏరియాలు, హైరిస్క్ విలేజిలు గుర్తించి విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. హెచ్ఐవీ వ్యాధి సోకిన వారిని గుర్తించి వారితో భాగస్వామ్యం ఉన్న వ్యక్తులను గుర్తించి వారికి తప్పనిసరిగా హెచ్ఐవీ పరీక్షలు చేయించాలన్నారు. తల్లి నుంచి బిడ్డలకు హెచ్ఐవీ సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రతి గర్భిణికి హెచ్ఐవీ టెస్టులు చేయించాలని ఆయన తెలిపారు. జిల్లాలో ఎక్కడైతే రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో సిబ్బంది వెళ్లి వారికి అవగాహన కల్పించి హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సూపర్‌వైజర్ వి.అనిల్ కుమార్, డాప్యు అకౌంటెంట్ రాజశేఖర్, షూర్ ఎన్జీవో పీఎం మల్లికార్జున్, డీఆర్పి భాగ్యలక్ష్మి, ఐసీటీసీ కౌన్సిలర్లు ఎల్లేష్, సుదర్శన్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్ రెడ్డి, షూర్, వైఆర్ జి కేర్ సిబ్బంది పాల్గొన్నారు.