Jagtial MLA joined Congress: బీఆర్ఎస్ పార్టీకి షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వరుస కడుతున్నారు. రాత్రికి రాత్రే రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే ఎమ్మెల్యేల చేరికపై పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్న సంజయ్‌ను రేవంత్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. మొన్న బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే చేరికతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పుంజుకుంటుండగా, బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పతనమవుతున్నది.