Photographer Chandu Road Accident Support Khanapur: నిర్మల్ జిల్లా కడం మండలం లోని ధర్మాజీపేట గ్రామానికి చెందిన సీనియర్ ఫొటో గ్రాఫర్ రోడ్డ చందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా స్నేహితులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ నెల 1వ తేదీన టాటా మ్యాజిక్ వాహనం ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిది పేద కుటుంబం కావటం, అతనికి రెండేండ్ల బాబు, పది రోజుల బాబు ఉన్నారు. అతని కుటుంబానికి సహాయం అందించేందుకు మోర్తాడ్‌కు చెందిన యూ అండ్ మీ ప్రీ వెడ్డింగ్ స్టూడియో నిర్వాహకులు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. భవిష్యత్‌లో కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో ఫొటో గ్రాఫర్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసారపు నవీన్, పెద్ది నర్సయ్య, ఖానాపూర్ అధ్యక్షులు గుగ్గిళ్ల ఎల్లయ్య, మాదిరె సతీశ్, సల్ల సతీశ్, ప్రశాంత్, శ్రీహరి, యూ అండ్ మీ స్టూడియో నిర్వాహకులు పాల్గొన్నారు.
