Lord Ayyappa: మెట్‌పల్లి, జనవరి 1 (మన బలగం): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పటణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బుధవారం అయ్యప్ప స్వామి వారికి చక్కెరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు-సరోజమ్మ, టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు-చంద్రిక, కార్యనిర్వాహక అధ్యక్షులు గంగుల వివేక్, అలయ అధ్యక్షులు దొమ్మటి ప్రవీణ్, ఆలయ గురుస్వామి మంత్రి అంజయ్య స్వామివారికి చక్కెరాభిషేకం నిర్వహించారు. అనంతరం పవిత్ర గోదావరి నది జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు అశోక్ శర్మ, శుక్లసాగర్ జీ శర్మ తీర్థప్రసాదాలు అందజేసారు. కార్యక్రమంలో మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కున గోవర్ధన్, గురుస్వాములు బసెట్టీ హరీశ్, బండారి మారుతి, జిందం శ్రీనివాస్, చెపురి రాము, సౌడల సంజీవ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.