Poetry competition: హైదరాబాద్, జనవరి 1 (మన బలగం): కణిక సాహిత్యం సామాజిక సేవ, విద్యారంగ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి రమాదేవి కులకర్ణి ఆధ్వర్యంలో ప్రతి వారం కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. నిర్వాహకులుగా సాయి స్రవంతి జాదవ్, దేవులపల్లి రమేశ్ వ్యవహరించారు. ఈవారం ‘నేటి మహిళ’ అంశం మీద నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ స్థానంలో డాక్టర్ బి.సుధాకర్, ద్వితీయ స్థానంలో కొంజేటి రాధిక, తృతీయ స్థానంలో రజనీ కులకర్ణి, వురిమళ్ల సునంద నిలిచారు. రచయిత్రి రమాదేవి కులకర్ణి మాట్లాడుతూ.. తమ సంస్థ నుంచి సాహిత్య పరంగా, విద్యాపరంగా విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.