Whip Adluri Laxman Kumar: ధర్మపురిలో ఇటీవల పునఃప్రారంభించిన సంస్కృతాంధ్ర కళాశాలను శుక్రవారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలశాలలో కొనసాగుతున్న పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మపురికి ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా ఈ హోదాలో ఉన్నానంటే అది మీ అందరి సహకారం వల్లనే అని, మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలోనే ధర్మపురిలో అన్ని వర్గాల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.