Ayyappa Padipuja: ఎల్లారెడ్డిపేట, జనవరి 1 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బుధవారం నూతన సంవత్సరం వేళ స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణు ఘోషతో మార్మోగింది. ప్రతి ఏటా నిర్వహించే విధంగా జనవరి ఒకటో తారీఖున స్వామి వారి పడిపూజ మహోత్సవాల్లో భాగంగా పురవీధుల గుండా స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఊరేగింపులో ప్రజలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మలాధారులు, స్థానికుల నృత్యాలు అలరించాయి. అనంతరం అయ్యప్ప దేవాలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకములు, ప్రత్యేక పూజలు చేసారు. సాయంత్రం అయ్యప్ప పడిపూజలో గురుస్వాములు రాజు, శ్రీనివాస్, మధు, రవి, ఆలయ పూజారులు మధు గుండయ్య శర్మ, శ్రీకాంత్ పంతులు, రమాకాంత్, మాలాదారులు, భక్తులు పాల్గొన్నారు.