Sai baba Temple Chairman: నిర్మల్, డిసెంబర్ 26 (మన బలగం): డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు సహకారంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయిబాబా ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆలయ నూతన చైర్మన్ గంగోని బూరాజ్ అన్నారు. గురువారం నూతన చైర్మన్‌తో పాటు ధర్మకర్తలను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోవు రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇందులో ధర్మకర్త కత్తి సురేష్, మాజీ సర్పంచ్ రాంరెడ్డి, నాయకులు గాజుల రవికుమార్, శ్యామకూర రాము, సయ్యద్ అజహార్, శ్రీహరి, నర్సారెడ్డి, మహేందర్ తదితరులున్నారు.