Sand Committee Meeting: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ప్రభుత్వ నిర్మాణ, స్థానిక, వాణిజ్య అవసరాలకు ఇసుక రీచ్‌లు గుర్తించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లెవెల్ సాండ్ కమిటీ మీటింగ్ కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 3, టీజీ ఎండీసీ లక్ష్యం తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ఇసుక రీచ్‌లు ఎన్ని ఉన్నాయో ఆరా తీశారు. ప్రస్తుతం క్యూబిక్ మీటర్ ఇసుకకు రూ.100 ఉండగా, రూ.160కి పెంచాలని కమిటీలో ప్రతిపాదనలు చేశారు. చెక్ డ్యాంల నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఇసుక తీయాలని ఆదేశించారు. పీసీబీ ఇతర శాఖల సమన్వయంతో ఇసుక తరలించాలని సూచించారు. సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఆర్డీవో శేషాద్రి, డీటీవో లక్ష్మణ్, జిల్లా ఇరిగేషన్ అధికారి అమరేందర్ రెడ్డి, సర్వే ఏడీ వినయ్ కుమార్, మిషన్ భగీరథ ఈఈ జానకి పాల్గొన్నారు.