Shanti Yajna: ఇబ్రహీంపట్నం, మార్చి 13 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలోని అతిపురాతన శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం యజ్ఞం నిర్వహించారు. అర్చకులు చక్రపాణి నర్సింహమూర్తిచార్యులు స్వామివారి మూలవిరాటు, ఉత్సవమూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలోని యజ్ఞ మండపంలో స్వామి వారిని ఆవాహనం చేసి శాంతి యజ్ఞం నిర్వహించారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ, ఎదుర్కోల్ల కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ చైర్మన్ బర్మ మల్లయ్య, మాజీ సర్పంచ్ సున్నం నవ్యశ్రీ, మాజీ ఎంపీటీసీ పెంట లక్ష్మీ, నాయకులు సున్నం సత్యం, పెంట లింబాద్రి, ఆలయ కమిటీ ఉపాధ్యక్షుడు కోటగిరి శ్రీనివాస్, కోశాధికారి గుడ్ల శ్రీధర్, కత్రోజి సాయికృష్ణ, కమిటీ సభ్యులు రాధారపు దేవదాస్, ఆరె వినయ్, తొపారపు ప్రభాకర్, రౌతు నర్సయ్య, సున్నం భూమన్న, దొనికెన గంగన్న, దాసరి రాజు, రాసమల్ల లక్ష్మీరాజం, పాతర్ల రెడ్డి, సుంకిసాల ధర్మాగౌడ్, మగ్గిడి గంగారాం, బుక్య దత్తాద్రి, బండమీద బుచ్చన్న, ఆలయ అర్చకులు మంత్రరాజం శ్రీనివాస్ చార్యులు, మంత్రరాజం జానకిరామకృష్ణాచార్యులు, మంత్రరాజం అరవింద్ కృష్ణాచార్యులు, సాముజి నవీన్ చార్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.