Banjara dance: రాయికల్, జనవరి 8 (మన బలగం): భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో కేరళలోని కోజికోడ్ ఇరింగల్‌లో సర్గాలయ ఇంటర్నేషనల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఫెస్టివల్‌లో తెలంగాణ సాంప్రదాయ బంజారా నృత్యంతో మన రాష్ట్ర యువ కళాకారులు ఉర్రూతలు ఊగించారు. రాయికల్ మండలానికి చెందిన గంగాధర్ నాయక్ తనతో పాటు 15 మంది యువ కళాకారులతో వెళ్లి అక్కడ ప్రత్యేకమైన వేషధారణ కలిగిన తెలంగాణ బంజరాల నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమం అనంతరం కేరళలోని ప్రజలు చాలామంది అద్భుతంగా చేశారని కొనియాడారు. ప్రత్యేక వేషధారణ కలిగిన కళాకారులతో చాలా ఫొటోలు దిగారు. మరియు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అడిగిమరీ తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ ఆహ్వానం మేరకు గంగాధర్ నాయక్, రేండ్ల కలింగ శేఖర్ ఆధ్వర్యంలో దేవరకొండకు చెందిన తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీకి చెందిన పదిమంది అమ్మాయిలు, మాస్టర్ సంతోష్ నాయక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాయిద్య కళాకారులు నాగరాజు నాయక్, ఇదునూరి రమేశ్ రాకేశ్, పులిపాక అజయ్ తదితర కళాకారులు పాల్గొన్నారు. కళాకారుడు గంగాధర్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రం యొక్క సాంప్రదాయ ఖ్యాతిని మేము ప్రదర్శించడం మమ్మల్ని అందరూ అభినందించడం చాలా సంతోషం అనిపించింది అని కాగా ఇలాంటి ప్రత్యేక జాతీయ వేదికలపై తెలంగాణ సాంప్రదాయం అయినటువంటి బంజారా నృత్యం బతుకమ్మ మరియు బోనాలు చేయడం గంగాధర్ నాయక్‌కు ఒక ప్రత్యేకత అయింది. ఎన్నో రాష్ట్రాలలో ఈ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం ఈ యొక్క సర్గాలయ ఉత్సవాలలో ఒక ప్రత్యేకమైన ప్రదర్శన మన తెలంగాణ రావడం చాలా అదృష్టకరం. వీరిని పలువురు రాష్ట్ర అధికారులు మరియు కళాకారులు అభినందించారు.