Cattle grazer killed in lightning strike Nirmal: నిన్న సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామానికి చెందిన సాకలి పోశెట్టి వయసు 52 సంవత్సరాలు గేదెలు మేపడానికి పాలేరుగా నియమితులయ్యాడు. సోమవారం ఉదయం గేదెలను మేపడానికి వెళ్ళాడు. నిర్మల్ పట్టణ శివారు మంజులాపూర్ పెద్ద చెరువు సమీపంలో గేదెలను మేపుతుండగా ఒకసారిగా పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడంతో మంగళవారం నీటిమడుగులో విగత జీవిగా పడి ఉన్నాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కున కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదన అందర్నీ కలచివేసింది.