BC Welfare Association: నిర్మల్, జనవరి 24 (మన బలగం): జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా పొన్నం నారాయణ గౌడ్‌ను నియమిస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య శుక్రవారం నియామకపత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన నారాయణ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో బీసీలను ఐక్యం చేసి బీసీల సమస్యల పరిష్కారం కొరకు పూర్తిగా కృషి చేస్తామని, తనపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు ఆర్.కృష్ణయ్యకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా బీసీలను ఐక్యం చేసేందుకు కృషి చేస్తానని నారాయణ గౌడ్ అన్నారు. గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ బీసీలను సంఘటిత పరిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సంఖ్యలో బీసీలు గెలుపొందే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాజకీయాలకతీతంగా బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.