MLC Nomination: నిర్మల్, ఫిబ్రవరి 7 (మన బలగం): ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన నంగె శ్రీనివాస్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టభద్రులు తాత్కాలిక ఆకర్షణలను పక్కన పెట్టి నిజాయితీ, నూతనత్వం, సమగ్ర అభివృద్ధికి కృషి చేసే వారికి ఓటు వేయాలని కోరారు. గత ఎమ్మెల్సీ గెలిచి శాసనమండలిలో పట్టభద్రుల, నిరుద్యోగ సమస్యలను ప్రస్తావించిన దాఖలాలు లేవని అన్నారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.