Police Act in Jagityala District
Police Act in Jagityala District

Police Act in Jagityala District: జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ అశోక్ కుమార్

Police Act in Jagityala District: జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 1 (మన బలగం): జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల (జనవరి 1వ తేదీ నుంచి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని ఎస్పీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *