Road Safety Months: నిర్మల్, జనవరి 1 (మన బలగం): అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదాలు జరుగుతాయని, మనపై ఎన్నో కుటుంబాలు ఆధారపడ్డ విషయాన్ని ప్రతి ఆర్టీసీ ఉద్యోగి గుర్తించాలని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి అన్నారు. ఆర్టీసీ నిర్మల్ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను ఈనెల 31 వరకు నిర్వహిస్తున్నట్లు డిపోమేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ప్రమాదాలు ఎలా జరిగాయి వాహనాలను ఎలా ఓవర్ టేక్ చేయాలి. మూల మలుపుల దగ్గర ఎలా అప్రమత్తంగా ఉండాలి పవర్ పాయింట్, వీడియోలను ప్రాజక్టర్ ద్వారా కళ్ళకు కట్టినట్లు చూయించారు. మనం ప్రజా రవాణలో పని చేస్తున్నాము. మనపై ప్రయాణికులు నమ్మకముతో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు.మనం డ్యూటీ కి బయలు దేరి వచ్చే వరకు మన కుటుంబ సభ్యులు ఎదిరి చూస్తారు.దేశంలోని రోడ్ లు అన్ని చాలా బాగున్నాయి.అన్ని ఫోర్ లైన్స్ సిక్స్ లైన్స్ అని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడుపొద్దని ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి డిపోమేనేజర్ పలు సూచనలు సలహాలు ఇచ్చారు.కార్యక్రమములో అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్,విజలెన్స్ ప్రభుదాస్,ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.