Nirmal District Collector: నిర్మల్, జనవరి 1 (మన బలగం): బాగా చదువుకొని అమ్మానాన్నలతోపాటు సొంత ఊరికి గుర్తింపు వచ్చే విధంగా మసులుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కేజీబీవీ విద్యార్థినులతో కలిసి ఉదయం అల్పాహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. నూతన సంవత్సరంలో కొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలని సూచించారు. విద్యార్థినులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కేజీబీవీ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.