Live broadcast of Rythu Festival Sabha tomorrow
Live broadcast of Rythu Festival Sabha tomorrow

Live broadcast of Rythu Festival Sabha tomorrow: రేపు రైతు పండుగ సభ ప్రత్యక్ష ప్రసారం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Live broadcast of Rythu Festival Sabha tomorrow: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: రైతు పండుగ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రైతులను ఉద్దేశించి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రసంగిస్తారని, కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 13 రైతు వేదికలలో ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని రైతు సోదరులందరూ తమ గ్రామాల సమీపంలో ఉన్న రైతు వేదికలకు తరలివచ్చి, సీఎం ప్రసంగాన్ని వీక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, తంగళ్లపల్లి మండలం తాడూరు, గంభీరావుపేట మండలం నర్మాల, రుద్రంగి, ముస్తాబాద్ మండలం బద్దనకల్, ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట, చందుర్తి, బోయినపల్లి మండలం కొదురుపాక, వేములవాడ అర్బన్ మండలం మారుపాక, వీర్నపల్లి, ఇల్లంతకుంట రైతు వేదికల్లో ముఖ్యమంత్రి సభ ప్రత్యక్ష ప్రసారం లో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *