- నిర్మల్ ఏఎంసీ చైర్మన్‌గా సోమ భీమ్ రెడ్డి
- సారంగాపూర్ చైర్మన్‌గా అబ్దుల్ హాది
Appointment of AMC Chairmen: నిర్మల్, అక్టోబర్ 9 (మన బలగం): నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నిర్మల్ రూరల్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఉద్యమ నేత లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన ఈటెల శ్రీనివాస్, సారంగాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా స్వర్ణ గ్రామానికి చెందిన అబ్దుల్ హాది, వైస్ చైర్మన్‌గా బీరవెల్లి గ్రామానికి చెందిన లక్కడి శంకర్ రెడ్డి నియమితులయ్యారు. రెండు మార్కెట్ కమిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 16 మంది సభ్యులను నియమించారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావులకు కృతజ్ఞతలు తెలిపారు.