ISKCON Temple President Narahari Prabhuji: ఇబ్రహీంపట్నం, జనవరి 5 (మన బలగం): ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు నరహరి ప్రభుజీ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో పెద్దాపూర్ ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో గ్రామ సంకీర్తన నిర్వహించారు. అనంతరం అతిపురాతన శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో నరహరి ప్రభుజి ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా భగవద్గీతలోని పలు అంశాలను వివరించారు. అనంతరం భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరహరి ప్రభును ఆలయ కమిటీ సభ్యులు యామపూర్ విండో చైర్మన్ అంకతి రాజన్న, నాయకులు సున్నం సత్యం, పెంట లింబాద్రి శాలువా పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ సురనాథ్ శ్రీనివాస్ దాస్, బృందం సభ్యులు నిత్యానంద్ స్వరూప్ దాస్, నటవర నరేశ్ దాస్, గోవర్ధన్, అనిల్, వేదాంగ్, ప్రణయ్, ఆలయకమిటీ అధ్యక్షులు బర్మ మల్లయ్య, సభ్యులు రాధారపు దేవదాస్, కోటగిరి శ్రీనివాస్, కత్రోజ్ సాయికృష్ణ, తోపారపు ప్రభాకర్, మగ్గిడి గంగరాం, భక్తులు పోతరాజు శివరాజం, గుమ్మల తిరుపతి, అరె రమేశ్, పొన్నం గణేశ్, మాలెపు శ్రీనివాస్, ఆలయ అర్చకులు మంత్ర రాజం శ్రీనివాసాచార్యులు, భక్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.