మంత్రి సీతక్కతో ఫోన్‌లో మాట్లాడిన ఎస్పీ జానకి షర్మిల
called off strike: నిర్మల్, అక్టోబర్ 9 (మన బలగం): నిర్మల్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ తొమ్మిది రోజులుగా కార్మికులు సమ్మె చేపట్టారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సెలవులో ఉండడతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క సూచనతో పారిశుద్ధ్య కార్మికులు ఎస్పీ జానకి షర్మిలని కలుసుకున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కతో ఎస్పీ సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు చేపడుతున్న సమ్మె విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నెలరోజుల వేతనం చెల్లించేందుకు హామీ ఇచ్చారు. మిగతా పెండింగ్ వేతనాలు త్వరలోనే చెల్లిస్తామని వారికి భరోసా కల్పించారు. దీంతో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే స్పందించి మంత్రి సీతక్కతో మాట్లాడి వేతనాలు చెల్లించేందుకు కృషి చేసిన ఎస్పీ జానకి షర్మిలకు పారిశుద్ధ్య కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.