Demand for Pension Hike to ₹6,000 for Disabled in Telangana: ప్రభుత్వం ఎన్నికల్లో వికలాంగుల పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చి పెంచకుండా తాత్సారం చేస్తున్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు రహీమ్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వికలాంగుల పింఛన్ 6 వేల రూపాయలకు పెంచాలని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులతో పాటు ఇతర పింఛన్లు రూ.4 వేలకు పెంచాలని, ఇప్పటికే నూతనంగా దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే పింఛన్ మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రం అయిన ఏపీలో విలాంగులకు 6 వేలు, ఇతర పింఛన్లు 4 వేల పెంచారని, అలాగే పూర్తి స్థాయి అంగవైకల్యం వారికి 15 వేలు ఇస్తున్నారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి, అమలు చేయక పోవటం సరైంది కాదని ఆవేదన చెందారు. ప్రభుత్వ ఏర్పడి 22 నెలలు గడిచినప్పటికీ, వికలాంగుల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పటికైనా పింఛన్లు పెంచి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో వికలాంగుల సంఘం నాయకులు అబ్దుల్ వకీల్, జావీద్, అలీ, రవి, గంగారాం, ముస్తాక్, సుధాకర్, శంకర్, సాగర్, షేఖ్ మహాముద్, మియాఖాన్ తదితరులు పాల్గొన్నారు.