Former Naxalite
Former Naxalite

Former Naxalite: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసిన మాజీ నక్సలైట్

Former Naxalite: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి గ్రామ ఎస్సీ(మాదిగ) కులానికి గుంటుకు రవి (అలియాస్) అశోక్ తండ్రి ఎల్లయ్య రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998 – 2003 వరకు పీపుల్స్ వార్ దళం (ఎల్‌జిఎఫ్) ఏరియా మద్దిమల్ల సివోగా వివిధ హోదాల్లో పనిచేశానని తెలిపారు. నక్సలైట్లకు అప్పటి ప్రభుత్వం పునరావాసం కింద 5 ఎకరాల భూమి, 3 లక్షల నగదు ఇస్తామని రివర్డ్ ప్రకటించిందన్నారు. ప్రకటనకు ఆకర్షితుడనై 09-01-2003 రోజున అప్పటి వరంగల్ ఐజి సమక్షంలో లొంగిపోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రివర్డ్ నాకు పోలీస్ శాఖ వారు అనుమతించారనీ కానీ, అప్పటి నుండి నేటి వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ అధికారుల చుట్టు తిరిగిన 5 ఎకరాల భూమి, 3 లక్షల నగదు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎలాంటి భూమి, ఇల్లు లేక చాల దీనమైన పరిస్థితులల్లో జీవస్తున్నాని తెలిపారు.ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ పరిస్థితులను ఆలోచించి రివర్డ్‌ను ఇప్పించగలరని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *