tribal problems: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 4 (మన బలగం): తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్‌టి, ఎస్‌సి కమిషనర్లకు సమస్యలను వివరించిన తెలంగాణ రాష్ట్ర గోర్ సీక్వడి మీడియా సంయోజిక్ రవిలాల్ నాయక్ విన్నవించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్టి స్టడీ సర్కిల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇంతవరకు ఏర్పాటు చెయ్యలేదని, జిల్లా నిరుద్యోగ విద్యార్థులు నానా ఇబ్బంది పడుతున్నారనీ, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విషయంలో 2014 తర్వాత ఇంతవరకు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదనీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగాల్లో ఎస్టీ రిజర్వేషన్ ప్రకారం 10% అమలు చేయలేకపోవడం దేవాలయంలో ఒక్కరు కూడా ఎస్టీ సంబంధించిన ఉద్యోగులు లేకపోవడం లేదన్నారు. తండాలలో ఉన్న మందిరాల్లో ధూప దీప నైవేద్యం కింద కనీసం నెలకు పదివేల రూపాయలు అందివ్వాలి పేర్కొన్నారు.
దేశంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో రెండోవ భాష గోర్ బోలి భాష అని, దీనిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వానికి తమ ద్వారా కేంద్రానికి ప్రజల యొక్క డిమాండ్‌ను తెలియజేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రతీ కార్పొరేట్ స్కూల్లో ఎస్సీ ఎస్టీ విద్యార్థి విద్యార్థులకు 25% ఫ్రీ ఎడ్యుకేషన్ అది రాజ్యాంగంలో పొందుపరిచిన విషయం తెలిసినదే కానీ ఇప్పటివరకు ఇచ్చిన దాఖలాలు లేవు ఇది పూర్తి స్థాయిలో అమ్ములు కావడం లేదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తండలలో తీవ్ర నీటి సమస్య వున్నదని మరియు ప్రభుత్వ స్కూళ్లలో మలమూత్ర విసర్జన వంటివి కనీస సౌకర్యాలు లేవు కాబట్టి వీటన్నిటిని సత్వరంగా పరిష్కరించాలని కోరారు. విద్యారంగంలో విదేశీ విద్య చదువుకునే విద్యార్థినులకు స్కాలర్షిప్ వెంటనే అందివ్వాలని పేర్కొన్నారు. పోడు భూముల విషయంలో ఆర్ ఓఆర్ పట్టాలు భూ పంపిణీ చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ఆర్థిక విద్య రాజకీయ సామాజిక బ్యాంకింగ్ ఉపాధి ప్రభుత్వ పథకాలు వంటి అంశాలను చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లైవ్ రాష్ట్ర నాయకులు భానోత్ నరేష్ నాయక్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ అజ్మీర తిరుపతి నాయక్, తిరుపతి నాయక్ గోర్ సేన జిల్లా అధ్యక్షుడు బుక్య రాజు నాయక్, ప్రవీణ్ నాయక్, డాక్టర్ చందర్ నాయక్ గోర్ బంజారా నాయకులు పాల్గొన్నారు.