100 crores donation: మన బలగం, తెలంగాణ బ్యూరో: అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని శుక్రవారం తెలంగాణ మఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును గౌతమ్ అదాని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.