Samburula in BJP office: నిర్మల్, నవంబర్ 23 (మన బలగం): మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శనివారం నిర్మల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, అయ్యన్న గారి భూమయ్య, నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, మెడిసిమ్మె రాజు, రాచకొండ సాగర్, కోరిపల్లి శ్రావణ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, ఆడెపు సుధాకర్, అల్లం భాస్కర్, శ్రీరామోజు నరేశ్, కొండాజి శ్రావణ్, మూడోరపు దిలీప్, భరత్, తోట సత్యనారాయణ, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.