Tamannaah Bhatia: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah Bhatia)ను Enforcement Directorate (ED) సీక్రెట్‌గా విచారించింది. బిట్ కాయిన్ (Bitcoin), క్రిప్టో కరెన్సీ (Crypto currency)లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపి HPZ టోకెన్ మొబైల్ యాప్‌లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టేలా నిర్వాహకులు ప్రేరేపించినట్లు తెలుస్తోంది. అయితే HPZ యాప్ ప్రచారంతోపాటు ఈవెంట్‌లకు హీరోయిన్ తమన్నా భాటియా హాజరయ్యారు. ఇందుకుగాను పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. HPZ యాప్‌లో పెట్టుబడులు పెట్టిన పలువురు మోసపోయినట్లు గుర్తించి ఫిర్యాదు చేయడంతో ఈడీ (ED) రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నా ప్రమేయం ఏ మేరకు ఉందన్న విషయం తెలుసుకునేందుకు ఈడీ అధికారులు విచారణ మొదలు పెట్టారు. తాజా గురువారం ఆమెను సీక్రెట్‌గా విచారించినట్లు సమాచారం. అయితే ఆమెపై ఎలాంటి అభియోగాలు నమోదు చేయలేదు. గతంలో తమన్నాను విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశించినా షెడ్యూల్స్ బిజీగా ఉండడంతో విచారణకు హాజరు కాలేదని సమాచారం.