Telangana Language Day: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యా అధికారి జాదవ్ పరశురాం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థుల హాజరు గురించి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రతి రోజూ హాజరు కావాలని, ప్రతి విద్యార్థి పేరు ఎఫ్ఆర్ఎస్‌లో తప్పకుండా నమోదు చేయాలని చెప్పారు. కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించగా, ప్రజాకవి కాళోజీ నారాయణరావు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చిరస్మరణీయడని, అందరికి ఆదర్శం అని అన్నారు. ఆయన చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఆనందం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ క్యాతం సంతోష్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.