Kaloji Jayanti: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రజా కవి కాళోజీ నారాయణ రావు 111వ జయంతి పురస్కరించుకొని తెలంగాణ భాష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు బోనగిరి నరేందర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమకారుల్లో ఒకరైన కాళోజీ ప్రజలతో మమేకమై వాడుక భాషకు ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుకు చేసారు. కాళోజీ స్పూర్తితో మాతృభాషకు సముచిత స్థానం కల్పించాలని అన్నారు. అనంతరం వ్యాసరచన, ఉపన్యాస నిర్వహించి, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కుర్ర శేఖర్, వెన్నం అంజయ్య, తొంటి శంకర్, షేక్ ఇమ్రాన్, బాదోల్ల రవికుమార్, రాపర్తి కిషన్ ప్రసాద్, విజయ్ కుమార్, జోగ్దండ్ లక్ష్మణ్ రావు, దొమ్మాట శోభారాణి, నామాల సురేష్, వినోద్రాజ్, రాజ శ్రీనివాస్, పుప్పాల స్వప్న, గంగాధర్, సృజన, ఝాన్సీరాణి, ప్రకాష్, రమేష్ పాల్గొన్నారు.