Tummala Deva Rao: వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 48 మందికి 2024 సంవత్సరంలో సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీ (Suravaram Pratap Reddy Telugu University) కీర్తి పురస్కారం (Award of Fame) వరించింది. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, చరిత్ర పరిశోదకుడు డాక్టర్ తుమ్మల దేవరావ్ (Tummala Devara Rao)కు పరిశోధన విభాగంలో కీర్తిపురస్కారం వరించింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య వెల్దండ నిత్యానందరావు ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు గ్రహీతలకు నాంపల్లిలోని విశ్వవిద్యాలయ నందమూరి తారక రామారావు సభా ప్రాంగణంలో ఈనెల 23, 24 తేదీల్లో రూ.5116 నగదు పురస్కారంతో సత్కరించనున్నారు. తుమ్మల దేవరావు తన పరిశ్రమలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాకు చెందిన 17 శాసనాలను వెలుగులోకి తీసుకొచ్చి తన కృషితో వాటిని పరిష్కరింపజేశారు. 2000 సంవత్సరంలో నిర్మల్ జిల్లా కథలు పేరిట సుమారుగా 80 చారిత్రాత్మ కథలను ఆల్ ఇండియా రేడియో(All India Radio)లో ప్రసారం చేశారు. అనేక పురాతనమైన విగ్రహాలను వాటి యొక్క ప్రాశస్తాన్ని రికార్డు చేశారు.
నిర్మల్ జిల్లాకు చెందిన కోటలు, కట్టడాలు అదేవిధంగా రాజుల పరిపాలన అంశాలను అధ్యయనం చేసి వ్యాసాల రూపం(Essay format)లో పొందుపరిచారు. వారి పరిస్థితుల్లో భాగంగానే అనేకమైన ప్రజల జీవితాల్లో ఉపయోగించిన ప్రాచీన వస్తు కళా సంపద(Ancient art treasures)ను భద్రపరిచి వివిధ సందర్భాలలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వీరి కృషిని గుర్తించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పరిశోధకుడి(Best researcher)గా అవార్డను అందించారు. శాతవాహన రాష్ట్ర కోట కాకతీయ అసఫ్జాయి నిజాం(Nizam), కళ్యాణి (Kalyani), చాళుక్యుల(Chalukyas)కు సంబంధించిన అనేకమైన చారిత్రక అంశాలను వీరు రికార్డు చేశారు. వీరి పరిశోధనలు గుర్తించిన తెలుగు విశ్వవిద్యాలయం వారు 2024 సంవత్సరానికి గాను కీర్తి పురస్కారంతో సత్కరించనున్నారు. తెలుగు సాహిత్యంలో కవిత్వం, కథలు, వ్యాసాలు, విమర్శ, హైకూలు తదితర సాహితీ రంగాల్లో విశేషంగానికి చేసి అనేకమైన అవార్డులు పొందారు. తుమ్మల దేవరకు కీర్తి పురస్కారం దక్కడంతో నిర్మల్ సాహితి మిత్రులు డాక్టర్ దామెర రాములు, డాక్టర్ చక్రధారి, పత్తి శివప్రసాద్, నేరేళ్ల హనుమంతు, పోలీసు రాజేశ్వర్ రెడ్డి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.