Godadevi Ranganathula’s marriage mahotsav: నిర్మల్, జనవరి 13 (మన బలగం): అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ గోదాదేవి రంగనాథుల కల్యాణం అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య, ముత్యాల తలంబ్రాలతో ఘనంగా నిర్వహించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శ్రీశ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా గోదాదేవీ రంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ధనస్సు లగ్నంలో సూర్యుడు ప్రవేశించన రోజు ప్రారంభమైన రోజు నుంచి మకర సంక్రమణ నాడు పూర్తవుతుందని వేద పండితులు వాసుదేవా శ్రీనివాసమూర్తి, సందీప్ తెలిపారు. ఈ మాసంలో ప్రాతః కాలాన్నే సూర్యోదయం కాకముందు భగవంతునికి పూజ, నివేదన, అర్చనలు, పూర్తవుతాయని తెలిపారు. ధనుర్మాసంలో ఎవరైతే ప్రాతః కాలాన్నే పూజ చేస్తారో వారికి వాటంతటవే కోరికలు తీరుతాయని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కల్వకుంట్ల నారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షులు అడ్డగట్ల రాజన్న, మాజీ మంత్రి ఐకే రెడ్డి, ముఖ్య సలహాదారులు, ఓకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు, ఒడ్డేపల్లి కృష్ణంరాజు, సంజీవరావు, నిమ్మల రమేశ్, సుధాకర్, భీమన్న, బొంబాయి శ్రీనివాస్‌లతోపాటు భక్తులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణానికి హాజరైన భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు.