Eleti Maheshwar Reddy: నిర్మల్, జనవరి 13 (మన బలగం): నిర్మల్ శాసనసభ సభ్యులు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం నిర్మల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ బలరాం, రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ రవి కిరణ్, మురళి, జిల్లా ఉపాధ్యక్షులు ఆనందం, కోశాధికారి నవీన్, మహిళా ప్రతినిధి విజయలక్ష్మి, సంయుక్త కార్యదర్శి విష్ణువర్ధన్, స్టేట్ కౌన్సిలర్ ఓం ప్రకాష్ పాల్గొన్నారు.