Grant ESI Hospital
Grant ESI Hospital

Grant ESI Hospital: కరీంనగర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయండి

  • కేంద్ర కార్మిక శాఖ మంత్రికి బండి సంజయ్ విజ్ఞప్తి
  • సానుకూలంగా స్పందించిన మన్సూక్ మాండవీయ

Grant ESI Hospital: మనబలగం, తెలంగాణ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయను కోరారు. న్యూఢిల్లీలో మన్సూక్ మాండవీయను కలిసిన బండి సంజయ్ కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రం మెడికల్ హబ్‌గా మారిందన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి అత్యధిక మంది ప్రజలు వైద్యం కోసం కరీంనగర్‌కు విచ్చేస్తున్నారని తెలిపారు. ఉత్తర తెలంగాణలో బీడీ కార్మికులు, నేత కార్మికులు సహా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య అధికంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయడంవల్ల తమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూక్ మాండవీయ అతి త్వరలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *