BJP MLA Eleti Maheshwar Reddy temple funds: నిర్మల్ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ లో 16 ఆలయాలకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో లక్ష్మణ్ చందా, మండలంలో మార్కండేయ స్వామి ఆలయం – లక్ష్మణ్ చందా గ్రామం, హనుమాన్ ఆలయం – కంజర్ గ్రామం, హనుమాన్ ఆలయం – చామన్ పల్లి గ్రామం, ఎల్లమ్మ ఆలయం – పొట్టపల్లి గ్రామం, దిలవార్ పూర్ గ్రామంలో మార్కండేయ స్వామి ఆలయం, బీరప్ప ఆలయం, బ్రహ్మం గారి ఆలయం, మరియు చిట్యాల్ గ్రామంలో నరసింహ స్వామి ఆలయం, డ్యాంగాపూర్ గ్రామంలో పెద్దమ్మ ఆలయం, నిర్మల్ పట్టణం లోని గాజులపేట్ లో చిలుకల చిన్నమ్మ ఆలయం, రాంరావ్ బాగ్ హనుమాన్ ఆలయం, బుధవార్ పేట్ అభయాంజనేయ స్వామి ఆలయ ధ్యాన మందిరం, సొన్ మండలం లోకల్ వెల్మల్ గ్రామంలో భీమన్న ఆలయం, లకు నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.
సదరు మంజూరు పత్రాలను మండల నాయకులకు అందజేశారు. నిర్మల్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వ నిధుల 100 కోట్లతో అమృత్ త్రాగు నీటి పథకానికి 62.50 కోట్లు, నీటి శుద్ధి చేసే ఎస్ టి పి ప్లాంట్ల ఏర్పాటుకు 40 కోట్లు మంజూరు అయి పనులు ప్రారంభం అయినట్లు తెలిపారు. పట్టణంలో రోడ్ల నిర్మాణాలకు కూడా త్వరలో నిధులు మంజూరుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నిర్మల్ నియోజకవర్గ అభిద్ధికి పాటుపడుతానని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్ ల వల్ల పట్టణంలోని జి ఎన్ ఆర్ కాలనీ ముంపుకు గురైందని అన్నారు. ప్రస్తుతం అధికారులతో మాట్లాడి చెక్ డ్యామ్ ల ఎత్తును తగ్గించడం వల్ల జి ఎన్ ఆర్ కాలనీ సురక్షితంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంనాథ్, మెడిసెమ్మ రాజు, ముత్యం రెడ్డి, ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, నాయకులు చిన్నయ్య, రమేష్, విలాస్, విజయ్,శ్రీధర్ రెడ్డి , మధు తో పాటు తదితరులు పాల్గొన్నారు.