ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపు
Trade Unions:నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన బద్దం ఎల్లారెడ్డి భవన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సన్నాహక సదస్సు జరుగుతుందని, కావున జిల్లాలోని కార్మిక లోకం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్ పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని బైపాస్ రోడ్‌లో గల సిమెంట్ గోదాం హమాలీ కార్మికుల సమావేశం జంగం తిరుపతి అధ్యక్షతన గోదాం వద్ద జరిగింది. ఈ సందర్భంగా బుచ్చన్న యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయినా శ్రమిస్తున్న ప్రజల జీవితాలు మరియు జీవన ఉపాధిపై తన కార్పొరేట్ కుతంత్రాలు అమలు చేయాలని ప్రయత్నిస్తుందని దీనివల్ల దేశంలో పేదరికం, ఆకలి, పోషకాహార లోపం, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లేబర్ కోడులు అనేవి శ్రామిక ప్రజలపై బానిసత్వం విధించే బ్లూ ప్రింట్ లాంటివని సంఘంలోని కార్మికులకు సంబంధించిన అన్ని హక్కులు కార్మికుల నుంచి లాక్కుంటున్నారని, పని గంటలు, కనీస వేతనాలు, సామాజిక భద్రత పని పరిస్థితులకు సంబంధించిన అన్ని ప్రాథమిక హక్కులను తీవ్రమైన సవాలుగా పరిగణించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. యూనియన్ హక్కులు గుర్తింపు, సమష్టి నిరసనల హక్కు బావ వ్యవస్థీకరణ హక్కు తీవ్రమైన సవాలుగా మారాయని కార్పొరేట్ యజమానుల ప్రయోజనాల కోసం శ్రామిక ప్రజలపై బానిసత్వం యొక్క షరతులను విధించే బ్లూ ప్రింట్ లాంటివని కార్మికులు యూనియన్ నాయకులను నాన్ బెలబుల్ జైలు శిక్షలతో సహా కఠినమైన పోలీస్ చర్యలకు దారితీస్తుందని తెలిపారు.
యజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమష్టి ఫిర్యాదులను నిరాకరిస్తుందని, ఇలాంటి చట్టాలను కార్మిక లోకం వ్యతిరేకించాలన్నారు. అసంఘటిత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను దూరం చేస్తుందని అందుకని కేంద్ర కార్మిక సంఘాల ఫెడరేషన్లు దేశవ్యాప్త సమ్మెను చేస్తున్నాయని దీని విజయవంతం చేయాలని చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారుచేసి మే 20న దేశవ్యాప్త నిరవధిక సమ్మె చేయాలని అందుకోసమే సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మిక లోకం జిల్లా వ్యాప్తంగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. సమావేశంలో సిమెంట్ గోదాం హమాలీ అధ్యక్షులు జంగం తిరుపతి ఉపాధ్యక్షులు బాగోతం వీరయ్య, నాయకులు ననవేని కొమరయ్య ననవేని శ్రీనివాస్, పల్లెర్ల రాములు గౌడ్, ముత్యాల శ్రీనివాస్, దానవేని కొమరయ్య, ఉప్పారం శ్రీనివాస్, జక్కుల ఐలయ్య, దొంగల శ్రీనివాస్, బోయిని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.