Eatala Rajendar: భారత మొదటి ఉపప్రధాని, హోం మంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతిని మల్కాజ్గిరి డివిజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటేల్ విగ్రహానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, EX MLC రాంచందర్ రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ విజయలక్ష్మి, సీనియర్ నాయకులు VK మహేశ్, RK శ్రీనివాస్ మోహన్ యాదవ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.