Lok Sabha Results 2024: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గేడం నగేశ్ (Nagesh) ఆది నుండి ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుండి చివరి రౌండ్ వరకు బిజెపి అభ్యర్థి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఏడు శాసనసభ స్థానాలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. అన్ని నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ కంటే బిజెపికి అధిక శాతం ఓట్లు పోలయ్యాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ బిజెపి కైవసం చేసుకోవడం పట్ల ఆ పార్టీ వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. నిర్మల్ పట్టణంలో బిజెపి నాయకులు మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు.
ముందుగా బిఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన గెడమ్ నగేష్ టికెట్ కేటాయించడం పట్ల కొంత వ్యతిరేకత వచ్చినప్పటికీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే దృఢ సంకల్పంతో ప్రజలు స్వచ్ఛందంగా బిజెపికి ఓట్లు వేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి భారీ మెజారిటీతో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి గేడెం నగేష్ కు 568168 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు 477516 ఓట్లు వచ్చాయి. టిఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు కు 137300 ఓట్లు వచ్చాయి.దీంతో బిజెపి అభ్యర్థి గెడెం నగేష్ 90652 మెజారిటీతో విజ యం సాధించారు. మొదట ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపై కాంగ్రెస్, బిజెపి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని చర్చ జరిగింది. దీంతో ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై తీవ్రత ఉత్కంఠ నెలకుంది. అయితే మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపుతో అందరి అంచనాలను ఫలితాలు తారు మారు చేశాయి. భారీ మెజారిటీతో బిజెపి ఘన విజయం సాధించడం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.