food center Opening: నిర్మల్, డిసెంబర్ 24 (మన బలగం): సేంద్రియ ఉత్పత్తుల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం పొందవచ్చునని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో సేంద్రియ పదార్థాల చిరు ఆహార కేంద్రాన్ని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి కాలంలో సేంద్రియ పంట ఉత్పత్తుల ఆహార పదార్థాలకు విలువ పెరిగిందని తెలిపారు. ఈ ఆహార పదార్థాలను నిరంతరం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. వినూత్నంగా సేంద్రియ ఉత్పత్తులతో తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్‌ను ప్రారంభించడం ద్వారా ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లా అధికారులు, సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆహార పదార్థాలను రుచి చూశారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్‌వో కిరణ్ కుమార్, డీఏవో అంజి ప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.