MLC Jeevan Reddy’s birthday celebrations: ధర్మపురి, జనవరి 5 (మన బలగం): పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ధర్మపురిశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రసాదం, శేష వస్త్రం, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.