International Women’s Day: జగిత్యాల, మార్చి 8 (మన బలగం): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని దరూర్ క్యాంపులో రూ.5 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి జిల్లా సమాఖ్య భవన శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆర్డీవోతో కలిసి పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భగా మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళల కు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలకులు గడిచిన పదేళ్లలో ఎనాడైనా ప్రజల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళా సంఘాలకు జిల్లాకు 15 ఆర్టీసీ అద్దె బస్సులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మహిళా రక్షణ విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మహిళా అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.