Swasth Naari Sashakt Pariwar Abhiyaan Nirmal: నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా మహిళలకు పోషణ, ఆనారోగ్య పరమైన సమస్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఆస్పత్రిలోని వార్డులను పరిశీలించి రోగుల ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, సూపరింటెండెంట్ గోపాల్ సింగ్, డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి, వైద్యాధికారులు, మండల బీజేపీ నాయకులు నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, దత్తురాం, అర్జున్, మహిపాల్, ప్రవీణ్, గంగాధర్, విజయ్, సుధాకర్ పాల్గొన్నారు.