Padmashali Sangam Election: నిర్మల్, ఫిబ్రవరి 9 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని నగర్ శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం ఉత్తర విభాగం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక నందన డిగ్రీ కాలేజ్ ఆవరణలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం అశోక్, పోపా జిల్లా ప్రధాన కార్యదర్శి బొద్దుల రమణ, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్డ రమణ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా గురుడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా నరిమెట్ల జగదీశ్ (చిట్టి ), నరిమెట్ల సాయి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా మాన్పురి లక్ష్మణ్, కోశాధికారిగా ఓం ప్రకాశ్, సెక్రెటరీగా అవధూత్ భూమేశ్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సగ్గం హరిచరణ్, ఆడిటర్‌గా మైసర్ల సతీశ్, గౌరవ సలహా సభ్యులుగా తాళ్ల కిషన్ (రాకేశ్), గర్దాస్ చక్రధర్, రేగుంట నరేందర్, బైండ్ల భూమేశ్, మద్దెర్ల భోజన్న, ఆడెపు సుభాష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ మాట్లాడుతూ పద్మశాలి కుల సంఘ అభివృద్ధికి ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. ఐకమత్యంతోనే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. సంఘ భవనాల నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామన్నారు. సంఘ సభ్యులందరికీ అండగా నిలుస్తామన్నారు. నూతనంగా ఎన్నికైన సంఘ బాధ్యులు కలిసికట్టుగా ముందుకు సాగి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
