Appreciation
Appreciation

Appreciation: దేవులపల్లి రమేశ్‌కు ప్రశంసలు

Appreciation: సిద్దిపేట, ఫిబ్రవరి 9 (మన బలగం): ఎంజేపీ గురుకుల పాఠశాల తెలుగు అతిథి ఉపాధ్యాయుడు దేవులపల్లి రమేశ్‌ను పలువురు కవులు అభినందించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ, మరియు తెలుగు భాషా చైతన్య సమితి, ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శతజయంతి (1925-2025) నిర్వహించిన ‘దాశరథి సాహిత్య సమాలోచన’లో భాగంగా దాశరథి జీవితం- సాహిత్యం, మనోవిజ్ఞానిక, విశ్లేషణ అనే అంశంపై డాక్టర్ సి.వీరేందర్ చేసిన ఉపన్యాసంలో రమేశ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను తెలంగాణ సాహిత్య అకాడమీ, కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి, తెలుగు భాషా చైతన్య సమితి, అధ్యక్షులు పి.బడేసాబ్, డాక్టర్ ఎడ్ల కల్లేష్ అభినందించారు. ఆన్‌లైన్‌లో పంపిన ప్రశంసా పత్రాన్ని కవి, రచయిత, దేవులపల్లి రమేశ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు, సాహిత్య మేధావులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *