BJP: మల్యాల, మార్చి 18 (మన బలగం): భారత దేశంలో ఏకకాలిక ఎన్నికల సంస్కరణల కార్యశాల కార్యక్రమం మద్దుట్ల గ్రామంలో ఒకే దేశ ఒకే ఎన్నిక మండల కన్వీనర్ బొబ్బిలి వెంకటస్వామి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వాసాల రమేష్ మాట్లాడుతూ జమిలి ఎన్నికలు ఒకే సారి నిర్వహించడం వాళ్ళ దేశానికి, రాష్ట్రానికి, ప్రతి గ్రామానికి, వార్డులకు జరిగే లాభాలను వివరించడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బింగి వేణు, మండల అధ్యక్షుడు గాజుల మల్లేశం, మాజీ ఎంపీటీసీ సంఘని రవి, కో కన్వీనర్ కెల్లేటి రమేష్, రమ, బూత్ అధ్యక్షులు పరమేష్. సంకుర్తి తిరుపతి. మల్లేశం. గుగ్గిల గంగారాం. అనిల్. గంగారెడ్డి. చంద్రయ్య. పొన్నం సాయి కుమార్. హర్షవర్ధన్, తోట రవి, మల్లయ్య, శ్రవణ్, నాగరాజ్, మల్లేశం, నక్కా ఆనందం, గ్రామస్తులు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.