ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారుల స్థలం క్షేత్రస్థాయి పరిశీలన
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 18 (మన బలగం): ఎల్.ఆర్.ఎస్.2020 దరఖాస్తుదారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ రూరల్ మండలం అగ్రహారం పరిధిలోని అజెన డెవలపర్స్ కు సంబంధించి శ్రీనివాస్ తన వెంచర్ లో మొత్తం 11 ఎకరాల 25 గంటల భూమి ఉండగా, దానిలో 117 ప్లాట్స్ చేసినట్లు, ఎకరం 06 గుంటలు పార్క్ కోసం వదిలినట్లు తదితర వివరాలతో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ వెంచర్‌ను కలెక్టర్, ఎల్ఆర్ఎస్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సందీప్ కుమార్ ఝా, కమిటీ సభ్యులు వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, పీఆర్, ఆర్ అండ్ బీ ఈఈలు, నీటి పారుదల శాఖ ఈఈ, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఏడీ ఎస్ఎల్ఆర్ వెంకట్ రెడ్డి, డీపీఓ, డీటీసీపీఓ అన్సార్ ఉన్నారు. ఆ వెంచర్ ను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయా శాఖల ఆద్వర్యంలో సమగ్ర సర్వే చేసి, పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
