Visit of National Monitoring Team: ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 18 (మన బలగం): కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును శుక్రవారం జాతీయ బృందం పరిశీలించింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి, బర్దిపూర్ గ్రామాల్లో నేషనల్ మానిటరింగ్ టీం సభ్యులు డాక్టర్ బి.సుబ్రహ్మణ్యం రెడ్డి, టీం సభ్యులు జయప్రకాష్, లెజెన్ అధికారి శ్రీనివాస్ పర్యటించారు. అధికారులకు మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం అధికారులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోని పలు అంశాలను మహిళలకు వివరించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో లోన్‌లు తీసుకున్న వారిని, పింఛన్‌లు వస్తున్న వారిని నేరుగా కలిసి వివరాలు సేకరించారు. అనంతరం పలు సంక్షేమ పథకాలను వినియోగించి చేసిన అభివృద్ధి పనులు, రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో మదన్ మెహన్, ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శోభారాణి, మండల వ్యవసాయ అధికారి అకు రాజ్ కుమార్, ఏపీఎం శంకర్, ప్రత్యేక అధికారి అరుణ, ఎంఎల్ హైప్పి రమ్య, పంచాయతీ కార్యదర్శులు దివాకర్, శ్రీకాంత్, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.