Indiramma housing constructions to be expedited in Khanapur: ఖానాపూర్, సెప్టెంబర్ 4 (మన బలగం): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోడలపంపు, కొత్తపేట, బావాపూర్ (కె ), గోసంపల్లె, బీర్నంది, ఎర్వచింతల్, కొలాంగూడ గ్రామాల్లో గురువారం ప్రభుత్వ ఇందిరమ్మ ఇండ్లకు చెందిన ఇందిరమ్మ కమిటీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులతో, మేస్త్రీలతో సమావేశం నిర్వహించారు. ఇండ్లును వేగవంతంగా బేస్మెంట్, పిల్లర్లు, గోడలు పూర్తి చేయాలని ఎంపీడీవో చిక్యాల రత్నాకర్ రావ్, తహసీల్దార్ సుజాత అన్నారు. పూర్తి అయిన ఇండ్లుకు వెను వెంటనే లబ్ధిదారుల ఎకౌంట్లో డబ్బులు జమ చేయటం జరుగుతుందని చెప్పారు. ఇంటి నిర్మాణాలు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు, మేస్త్రీలు పాల్గొన్నారు.