Water release: ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 25 (మన బలగం): సింగ సముద్రం ఆయకట్టుకు బుధవారం నీటి విడుదల చేసారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్, సర్వాయి పల్లె, నారాయణ పూర్, కోరుట్లపేట గ్రామాల్లోని 1600 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఆయా గ్రామాల్లో మాజీ సర్పంచుల ఆధ్వర్యంలో పారుకం కాలువల పూడికతీత పనులు పూర్తి చేశారు. చివరి మడి వరకు సాగునీరందుతుందని, రైతులు ఎవరు ఆందోళన చెందకూడదని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు. సింగ సముద్రంలో 24 ఫీట్ల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. రైతులకు నీటి పారుకంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట, రాచర్ల బొప్పాపూర్ మాజీ సర్పంచులు నేవూరి వెంకట్ రెడ్డి, కొండాపురం బాల్ రెడ్డి, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య గారి గోపాల్ రెడ్డి, రాగుల గాల్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, సద్ది లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ బాయ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాం రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండే శ్రీనివాస్ యాదవ్, నేవూరి రవీందర్ రెడ్డి, చల్ల మహేందర్ రెడ్డి, శ్రీపాల్ రెడ్డి, చేటుకురి తిరుపతి గౌడ్, మ్యాకల శరవీంద్, ఎనగందుల సత్యనారాయణ, కొన్నే పోచయ్య, కొన్నే రాజు, దీటి నర్సయ్య, సుంచు మెన్ లు సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.